పోరుమామిళ్ల: మన న్యూస్: మే 30:
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు.ఆయన చదువుకోనే రోజులో స్కూల్ ఫీజులు కట్టుకోలేని స్థితిలో కొంతమంది చర్చి ఫాదర్లు మరియు సిస్టర్లు ఆర్థిక సహాయంతో చదువుకుని దేవుని కృపతో ఆ రోజులో బడికి సైకిల్ మీద వెళ్లే వాడు ఒక్కసారి సైకిల్ సీట్ విరిగిపోతే ఆ సీటుకు దుప్పటి కట్టుకొని వెళ్లేవాడు సైకిల్ సీటు కొనుక్కోడానికి డబ్బులు లేని పరిస్థితి. ఆ పరిస్థితిలలో గొప్పగా చదువుకొని నా లాoటి పేద పిల్లలకు సహాయం చేయాలని ఆలోచన కలిగిoది. అంతే కాకుండా ఆ రోజులో పోరుమామిళ్ల ప్రాంతంలోని చిత్త థామస్ రెడ్డి అనేక మందికి తల్లి, తండ్రి లేని అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం చేసేవారు. నాకు కూడా సహాయం అందించారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయడంలో
నాకు ప్రేరణ చిత్త థామస్ రెడ్డి మరియు ఫాదర్ కొత్తపల్లి సామేలు నేను కొంతమంది సహాయంతో చదువుకుని ఒక స్థాయికి వచ్చి ఇటీవల ఆస్ట్రేలియా దేశంలో చర్చి ఫాదర్ గా పనిచేసి వచ్చినాను. తల్లి, తండ్రి లేని పిల్లలకు చిరు సహాయం చేస్తున్నాను. ఈ సహాయం కోసం నా మిత్రులైన ఆస్ట్రేలియా దేశం నుండి క్లాగన్ ఫ్రూట్ ప్రాంతంలో ఉన్న మరియా షిబ్బానిక్, మరి, ఇలియాస్ ,రోసి, ఆంటోనీ, డాక్టర్ మగ్గేలేనా, డాక్టర్ మరి, రోమన్ ముందుకు వచ్చారు. వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
కడప డయాసిస్ బిషప్ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ ఆశీస్సులతో 30 మంది తల్లి,తండ్రి లేని పిల్లలకు చిరు సహాయం చేస్తున్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *