ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్ లో ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా సాఫ్ట్వేర్ బాలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు అని ఆయన తెలుగుదేశం పార్టీలో చేసిన సేవలను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు అని సాఫ్ట్వేర్ బాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ మూలూరు చెరువు ఆయకట్టు చైర్మన్ ఉమాపతి రెడ్డి గల్లా గిరి వంశీ వినయ్ దుర్గా తిరుమల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *