పేదల ఆరోగ్య సంరక్షణ ధ్యేయం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ నెల్లూరు:- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది- చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో 39 మందికి 34 లక్షల విలువచేసే సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పరిధిలో 7 చెక్కుల ద్వారా రూ.12 లక్షల 8 వేలు, అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో 32 మందికి రూ.21 లక్షల 81 వేలు అందజేశారు. ఇప్పటివరకు ఎంపీ మరియు ఎమ్మెల్యే పరిధిలో 230 మందికి 3 కోట్ల 24 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో పేద ప్రజల వైద్యం కోసం నిధులు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ.. వారికి అండగా నిలుస్తోందన్నారు. సీఎంఆర్ఎఫ్ కు నమోదు చేసుకున్న వెంటనే నిధులు అందజేస్తుందని చెప్పారు. వరకు 12 విడతల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు. ఈ నిధుల వల్ల వేలాది మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీ రెడ్డి, ఇందుకూరుపేట మండల పార్టీ మాజీ అధ్యక్షులు వీరేంద్రనాయుడు, కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు నాప వెంకటేశ్వర్లు నాయుడు, విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు ఏటూరి శ్రీహరి రెడ్డి, కోవూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లా సుధాకర్ రెడ్డి, బుచ్చి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, బుచ్చి రూరల్ మండలాధ్యక్షులు బెజవాడ జగదీష్, బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వాడవాడల అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు

    మన న్యూస్, ఎస్ఆర్ పురం:– ఎస్ఆర్ పురం మండలం తయ్యురు గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామి సత్యమును గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసి మూడు రోజులపాటు విశేష పూజలు అందించారు. మూడవరోజు స్వామివారి మేళ…

    వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.

    ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..