బడుగుల ఆత్మబంధువు యన్టీఆర్

శ్రీకాళహస్తి, Mana News :- తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత ప్రయాణం ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై, ఒక మహాశక్తిగా మారి, సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే జోలె పట్టి ప్రజా నాయకుడిగా పేద ప్రజల ఆకలి తీర్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన యన్టీఆర్‌ బడుగుల ఆత్మబంధువు అని తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ గుర్తు చేశారు.
సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని నిత్య శ్వాసగా చేసుకొని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని, ఆయన ప్రతి అడుగు నేటి తరానికి మార్గదర్శి అని కొనియాడారు.
తెలుగు ప్రజల స్ఫూర్తి శిఖరం శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఈరోజు స్థానిక బేరివారి మండపం కూడలిలో ఆయన చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాలకే పరిమితం కాకుండా, తనకున్న బహుముఖ ప్రజ్ఞతో తెలుగు వారి సంస్కృతి, వారసత్వం, విలువలు, నీతి-నిజాయితి, భారతీయ తాత్వికత పట్ల అభిమానాన్ని ఆచరణలో చూపించిన ఎన్టీఆర్ వ్యక్తిత్వం విలక్షణమైనది అని వక్తలు కొనియాడారు.
ముక్కుసూటితనం, అంకితభావం, క్రమశిక్షణ, ఆదర్శప్రాయమైన జాతీయవాదం, లక్ష్యం పట్ల నిబద్ధత, దృఢమైన ఆత్మవిశ్వాసం సమ్మిళితమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వం చిరస్మరణీయమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైన వారి వ్యక్తిత్వ ప్రేరణతో యువతరం వికసిత భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యుడు యం.సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ నాయుడు, పొన్నారావు, గాలి మురళి నాయుడు, లక్కమనేని మధుబాబు, డా.యం.ఉమేష్ రావు, మునిరాజా యాదవ్, షేక్ ఖాదర్ భాషా, డి.వి.నారాయణ, వజ్రం కిషోర్, దుర్గాప్రసాద్, వెంకటరమణ, షేక్ మహబూబ్ భాషా, కోట చంద్రశేఖర్, భాస్కర్, బాలాజీ, వినయ్, మురళీకృష్ణ, రాజు, భాస్కర్, మణి, మురళి రెడ్డి, కృష్ణమూర్తి, ప్రభాకర్, కిరణ్, వినోద్, వంశీ, వెంకటస్వామి, సుల్తాన్, చాంద్ భాషా, బాలు, భార్గవ్, రవి, నాగరాజు, రమణ, జయచంద్ర, ముని కుమార్, వేణు, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 7 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…