

మన న్యూస్ ఐరాల మే-27 భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అట్లూరి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఐరాల మండల బీజెపి ప్రధాన కార్యదర్శి సి అశోక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “పార్టీ నిర్మాణంలో శ్రీనివాస్ సేవలు అమోఘం. నిత్యం బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అవిరామంగా పనిచేస్తున్నారు. పార్టీ శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న త్యాగాలు అనన్యసామాన్యమైనవి. ఆయన దీర్ఘాయువుతో ఆరోగ్యంతో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.ఆయనకు సాలవతో ఘనంగా సన్మానం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తద్వారా మండల బీజేపీ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.