

మన న్యూస్, తిరుపతి, మే 23:– తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ని శుక్రవారం తిరుపతిలో బిజెపి నేత పి నవీన్ కుమార్ రెడ్డి, టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ పి భువన్ కుమార్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దీపక్ రెడ్డి తో వారు చర్చించారు. కష్టపడి పనిచేసే వారికి ఆయా పార్టీలలో తగిన గుర్తింపుతో పాటు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత కల్పిస్తారని దీపక్ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి,
భువన్ కుమార్ రెడ్డిలకు సూచించారు.