మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తూ కొనసాగించాలని సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కాబడిన ముఖి సూర్యనారాయణ రైతులకు పిలుపునిచ్చారు.తాడూరు గ్రామంలో సి అర్ పి తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళిక లో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రతి రైతు తన కుటుంబ నికి ప్రాధాన్యత నివ్వాలని కనీసం తినే తిండిగింజలు కూరగాయలు తప్పనిసరిగా పురుగుమందులు రసాయన ఎరువులు వెయ్యకుండా పండించుకోవాలని వాటినే వినియోగించుకోవాలని కోరారు.ఆరోగ్యం పాడైన తర్వాత డబ్బు ఖర్చు పెట్టుకునే కంటే ఆరోగ్యం పాడవకుండా ముందుగానే సరి అయిన పోషక ఆహారాన్ని తీసుకోవాలని వ్యవసాయ శాఖ మరియు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఇచ్చిన సూచనలను పాటిస్తూ ముందుకు సాగాలని కోరారు ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యం తో పాటుగా కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పోటీ తత్వంతో ఎక్కువ రసాయనాలు వినియోగించకుండా చూడాలని కోరారు వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు, మాట్లాడుతూ భూమిలో 1 % ఉండాల్సిన సారం 0.01 % మాత్రమే ఉందని ఒకపక్క ఎరువుల ధరలు పెరగడమే కాకుండా ఎరువుల తయారీకి కావలసిన ఖనిజ నిలవలు తగ్గిపోతున్నాయని కాబట్టి కేవలం రసాయన వ్యవసాయం మీదే ఆధారపడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని రసాయన వ్యవసాయంతో అనుసంధానం చేస్తూ నవధాన్య గణ ద్రవ జీవామృతం కషాయాలు వంటి వాటిని అవసరం మేరకు వాడుతుండాలని తెలిపారు అనంతరం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో రైతులు డి రాము, డి శంకరరావు లను శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా కత్తెర పురుగు మరియు ఇతర పురుగుల నివారణకు అవసరమైన అగ్ని ఆస్త్రాన్ని రైతు దండుపాటి రాము ద్వారా తయారు చేయించి చూపించారు కేవలం 150 రూపాయలతో ఐదు ఎకరాలకు సరిపడా అగ్ని అస్త్రం తయారు. చేసుకోవచ్చని ఇదే రసాయన పురుగుమందులు కొనాలంటే నాలుగు వేల రూపాయల పైనే ఖర్చు అవుతుందని కాబట్టి రైతులందరూ, వ్యవసాయ సిబ్బందిని వినియోగించుకుని అజ్ఞాతరాన్ని తయారు చేయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ ఎల్ వన్ సూర్యారావు, ఐ సి ఆర్ పి కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *