కార్యకర్తల సంక్షేమమే మా ధ్యేయం: మినీ మహానాడులో పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ప్రతినిధి (పుతలపట్టు నియోజకవర్గం)మే-22 ప్రతి కార్యకర్త మీసం తిప్పి బ్రతికేలా పని చేస్తానని, పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి ఏ త్యాగానికైనా తాను సిద్దమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం క్రాస్ వద్ద గల బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన “మినీ‌ మహానాడు” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. మినీ‌ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన “పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్” తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల సమక్షంలో పలు తీర్మానాలు ఆమోదించారు. వైసీపి పాలనలో టిడిపి నాయకులు, కార్యకర్తలపై ఉన్న అక్రమ కేసులు ఉపసంహరణ, మామిడి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, యువతకు ఉపాధికి పరిశ్రమల స్ధాపన వంటి  అంశాలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ.. “తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలంమని, వైసీపి పాలనలో నాయకులు, కార్యకర్తలు చూసిన కష్టాలను మేము మరచి పోమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వెన్ను తిప్పకుండా శ్రమించిన నిజమైన కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని, వారి సంక్షేమమే మా ప్రథమ బాధ్యత” అని ఆయన స్పష్టం చేశారు. మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ఇప్పటికే అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని, దీనిపై మహానాడులో ప్రస్తావిస్తానన్నారు. అదేవిధంగా పాడి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. అదే విధంగా వైసీపి పాలనలో టిడిపి నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరణపై తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త మీసం తిప్పి బ్రతికేలా పని చేస్తామని చెప్పిన ఆయన అందరికి అందుబాటులో‌ ఉంటూ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే పూతలపట్టు నియోజకవర్గాన్ని యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి కార్యకర్త సంక్షేమం, పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు సి.ఆర్.రాజన్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, తవణంపల్లె మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి. ధరణీ నాయుడు,‌ ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర కన్నయ్య నాయుడు, మాజీ బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి. జయప్రకాష్ నాయుడు, ఐరాల మండల మాజీ అధ్యక్షులు గిరిధర్ బాబు, మాజీ కాణిపాకం ఛైర్మన్ మణి నాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు కోదండయ్య మరియు పూతలపట్టు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, మహిళలు పాల్గోన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 5 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.