మన న్యూస్ సాలూరు మే 21 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరుపట్టణంలో విద్యుత్ ఏడిఈ రంగారావును బుధవారం రాత్రి స్థానికులు రామ్ మందిరంలో నిర్బంధించారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గత మూడు రోజులుగా పట్టణంలో అల్లు వీధి, అక్కెన వీధి, నాయుడు వీధి, దుగ్గాణ వీధులకు గత మూడు రోజులుగా విద్యుత్ సేవలు నిలిచిపోవడంతో స్థానికులు బుధవారం నిరసన చాపట్టారు. విషయం తెలుసుకున్న విద్యుత్ ఏడిఈ రంగారావు అల్లు వీధి రామ మందిరం వద్దకు చేరుకున్నాడు. దీంతో స్థానికులు గత మూడు రోజులుగా విద్యుత్ సేవలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అస్సలు విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదని చెప్పగా కేవలం గంటె కదా విద్యుత్ సేవలు నిలిచిపోయాయి అని ఏడిఈ సమాధానం చెప్పడంతో ఆయనను వెంటనే రామ్ మందిరంలో స్థానికులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ అప్పలనాయుడు, రూరల్ సీఐ రామకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపడుతున్నారు. స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం నాలుగు వీధులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. విద్యుత్ అధికారులు తీరిపై తీవ్ర అసంతృప్తి తో విరుచుకుపడ్డారు.