మన న్యూస్ సింగరాయకొండ:-

రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు, విద్వాంసకారుల కదలికలతో అప్రమత్తమైన ప్రభుత్వ ఆదేశాల తో కోస్తా తీరం వెంట గ్రామాలలో నిఘా ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఎ దామోదర్ ,ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆదేశాలతో సింగరాయకొండ సిఐ చావా హాజరత్తయ్య, ఎస్సై బి మహేంద్ర ఆధ్వర్యంలో స్పెషల్ పోలీస్ బృందాలు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సింగరాయకొండ లోని పలు నివాస ప్రాంతాల్లో ఇల్లిల్లు జల్లెడ పట్టారు. సింగరాయకొండ ప్రాంతం లో బయటి వ్యక్తుల కదలికలు,నేర చరిత్ర గల వారి కదలికలు, అనుమానాస్పద ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్, డాగ్ స్క్వాడ్ తో సిఐ హాజరత్తయ్య కందుకూరు రోడ్డు లోని చంద్రబాబు నాయుడు కాలనీ,కందుకూరు రోడ్డు,రైల్వే స్టేషన్ రోడ్డు,పాకల రోడ్డు,ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ ప్రాంతంలో ఇండ్లలో సోదాలు చేశారు. భారీ పోలీస్ బలగాలతో ఇల్లిల్లు తనిఖీ చేపట్టడం తో ఇండ్లలోని ప్రజలు, మహిళలు భయాందోళనకి గురయ్యారు. ఈ సందర్భంగా సీఐ హాజరత్తయ్య మాట్లాడుతూ గ్రామాలలో ఎవరయినా గుర్తు తెలియని వ్యక్తుల సమాచారం ఉన్నా, అసాంఘిక శక్తుల కదలికలు, విచ్ఛిన్నకర శక్తుల సమాచారం ఉంటే పోలీస్ కి తెలియ జేయాలని పిలుపు ఇచ్చారు. కోస్తా తీర ప్రాంతం కేంద్రంగా చేసుకుని అరాచక శక్తులు విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్న విషయం ప్రజలు అర్థంచేసుకుని పోలీస్ కి సహకరించాలని ఆయన సూచించారు. కార్డన్ సెర్చ్ లో ఎస్సై బి మహేంద్ర, సిబ్బంది తో పాటు స్పెషల్ పోలీస్ సిబ్బంది గ్రామంలో కవాతు నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో అడిషనల్ ఎస్పీ ఎం ఎస్ ఎస్ అశోక్ బాబు,రిసర్వ్ ఇన్స్పెక్టర్ లు ఎస్వీ రమణారెడ్డి, ప్రసాద్,70 మంది సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి చెలామణి చేసే ప్రాంతాలు, మద్యం బెల్టు షాపులు, అసాంఘిక కార్యక్రమాల కు నెలవుగా ఉండే ప్రదేశాలు సరయిన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి రికార్డు లేని వాహనాలను సీజ్ చేశారు. తనికేలలో డాగ్ స్క్వాడ్,బాబ స్క్వాడ్,రోబో డ్రెస్ పార్టీ ,స్పెషల్ పార్టీ, ఎ ఆర్ పార్టీ,వజ్ర వాహనం,తో పాల్గొని ప్రజలను అప్రమత్తం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *