మన న్యూస్,తిరుపతి, :-దేశం కోసం విరోచితంగా పోరాడుతున్న సైనికుల సంక్షేమం కోసం తిరుపతిలోని పీజీ హాస్టల్స్ యజమాని జ్యోతి కృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకొని రూ. 5 లక్షల రూపాయల చెక్కు ను అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఎన్.సి.సి క్యాడెట్ కార్యాలయంలో గ్రూప్ కమాండర్ సత్యేంద్ర దయాల్ కు జ్యోతి కృష్ణ చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో జ్యోతి కృష్ణ మాట్లాడుతూ
దేశరక్షణ కోసం రణరగంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వీరోచితంగా పోరాడుతున్న రక్షణ దళాలకు భారతపౌరుడుగా తనవంతు రూ.5లక్షలు విరాళాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా అందజేయడం జరిగిందని చెప్పారు.ప్రపంచంలోనే భారత రక్షణ రంగం ప్రథమస్థానంలో ఉండాలని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నా వంతు బాధ్యతగా చిరు విరాళం తండ్రి శ్రీనివాసుల నాయుడు చేతుల మీదుగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు పిల్లలకు విద్యార్థి దశ నుంచి దేశభక్తిని నూరిపోయాలని, భరతమాత సేవలో తరించేందుకు ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విరాళం అందించిన జ్యోతికృష్ణ కుటుంబసభ్యులు, ఎన్సీసీ అధికారులు అనూప్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *