ఎస్ఆర్ పురం,మన న్యూస్.. మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శుక్రవారం గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డి పల్లె గ్రామంలో రుషేంద్ర రెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన ఇండోర్ క్రికెట్ కోర్టును,స్టేజి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు అనంతరం ఇండోర్ క్రికెట్ కోర్టులో ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ రాహుల్ బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ క్రికెట్ ఆడారు.. అలాగే ఎమ్మెల్యే తనయుడు రాహుల్ బ్యాటింగ్ చేయగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బౌలింగ్ చేయడంతో ఇండోర్ క్రికెట్ కోర్టు వారి క్రికెట్ ఆటను నియోజకవర్గ టిడిపి నాయకులు ఆసక్తిగా తిలకించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కుటుంబ సభ్యులను క్రేన్ ద్వారా గజమాల తో రుషేంద్ర రెడ్డి ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం అనంతరం ఋష్యేంద్ర రెడ్డి మాట్లాడుతూ జన్మభూమి ఋణం తీర్చుకోవడానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని రుషేంద్ర రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ మండల అధ్యక్షుడు దేవ సుందరం యాదవ్ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, టి ఎన్ టి యు సి నియోజకవర్గ కార్యదర్శి రుషేంద్ర రెడ్డి ,ఉమేష్ రెడ్డి గిరిబాబు విజయ్ కుమార్ మురుగయ్య పాపిరెడ్డి పల్లి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *