రేణిగుంట ఆగష్టు 15. రేణిగుంట పట్టణంలోని జి.ఎం. స్ట్రీట్ కిడ్స్ కింగ్డమ్ ప్రీస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. దేశానికి స్వాతంత్జ్రం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు దేశభక్తిని చాటేలా వివిధ ఫ్రీడమ్ ఫైటర్ల స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలతో అలరించారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి ప్రముఖుల వేషధారణల్లో ముద్దులొలికే చిన్నారులు చేసిన అభినయం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
పాఠశాల కరస్పాండెంట్ గౌసేబి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రసంగించారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరగా చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *