

దుత్తలూరు మన న్యూస్ : దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీలో టిడిపి గ్రామసభ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. అనంతరం గ్రామసభ నిర్వహించి మండల నాయకులు మరియు గ్రామ నాయకులు సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమిష్టిగా కృషి చేసి గ్రామాల అభివృద్ధి తో పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అర్ధరాత్రి అయినా ఓర్పుతో గ్రామ సభలో పాల్గొన్న గ్రామ నాయకులకు, మండల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య,మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం, మాజీ మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి మాజీ జెడ్పిటిసి సభ్యులు, పాముల సుబ్బరాయుడు, చీదర్ల మల్లికార్జున, మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు లింగాల నాగిరెడ్డి, కాకర్ల మధుసూదన్ రెడ్డి, శనివరపు సుబ్బారెడ్డి చిన్నపరెడ్డి వేలూరి హనుమంతు నాయుడు మండలం మరియు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.