

మన న్యూస్, నెల్లూరు, మే 8 :- విపిఆర్ ఫౌండేషన్ చే విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పనులకు 15 లక్షల ఆర్ధిక సహాయం.- క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం లక్షణాలు అవసరం. – క్రమశిక్షణ, కష్టపడేతత్వం వున్న వారే విజేతలవుతారు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.క్రమశిక్షణ, కష్టపడేతత్వం వున్న వారే విజేతలవుతారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ పోటీలలకు సంబంధించి విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ………క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం లక్ష్యణాలు చాలా అవసరమన్నారు. విజేతలుగా ట్రోఫీలు అందుకున్న క్రీడాకారుల ప్రతిభ మరియు అంకితభావానికి దక్కిన గుర్తింపు ఆమె అభివర్ణించారు. కోచ్ ల మార్గ దర్శకత్వం, తల్లి తండ్రుల ప్రోత్సాహంతో పాటు అలుపెరుగని క్రీడాకారుల సాధనే గెలుపు అనే లక్ష్యాన్ని చేరువ చేసిందన్నారు. క్రీడలైనా మరే ఇతర యితర రంగమైనా విజయం సాధించాలంటే క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో పాటు గెలవగలం అన్న ఆత్మ విశ్వాసం చాలా అవసరమన్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమిని కూడా గౌరవంగా స్వీకరించడమే క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటి అభివృద్ధి పనుల కోసం విపిఆర్ ఫౌండేషన్ తరుపున ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు 15 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, విక్రమ సింహపురి యూనివర్సిటి వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ సునీత తదితరులు పాల్గొన్నారు.
