

వెదురుకుప్పం మన న్యూస్ : చిత్తూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎన్. చినబాబు కుమారుడు ఎన్. నితిన్ కృష్ణ వివాహ మహోత్సవం ఘనంగా జరగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వెదురుకుప్పం టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ ఆనందరెడ్డి, పార్టీ నాయకులు మోహన్ మురళి, బి.ఎం. రవి, బోడిరెడ్డి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా టిడిపి నేతలు ఒకరితో ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పార్టీ నాయకత్వం పట్ల తమకున్న భక్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుక రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. నాయకుల సమాగమంతో వేడుకకు ప్రత్యేక రంగు చిందింది.ఇలాంటి శుభకార్యాల్లో నాయకులు కలిసిరావడం పార్టీ బలాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.