కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 8:- ఆలయంలో విఐపి కల్చర్ కు చెక్ చెప్పండి, అమ్మవారి ముందు అందరు సమానమే- సిసి కెమెరాల సంఖ్య పెంచి ఆకతాయిల ఆగడాలు అరికట్టండి. .- బ్రహ్మోత్సవాల సందర్బంగా జొన్నవాడ పరిసరాలలో మద్యం విక్రయాలను నియంత్రించండి. – భక్తుల సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దు.- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైటింగ్, ప్రసాదాలు, తెప్పోత్సవ ఏర్పాట్లు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.జొన్నవాడ కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలను అధికారులు మరియు ఆలయ సేవా కమిటి సభ్యులు పరస్పర సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఈ సందర్బంగా జొన్నవాడ విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి ఆలయ అర్చకులు మరియు సేవా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ నెల 17 వ తేది నుంచి 27 వ తేది వరకు జరిగే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా చేయవలసిన ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిగా హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మనపై వుందన్నారు. పోలీసు, రెవెన్యూ, ఎక్ట్రిసిటి, మరియు ఫైర్, ఆర్ టి సి లాంటి ప్రధాన శాఖల మధ్య సమన్వయము చాలా అవసరమన్నారు. అందరు సమిష్టి కృషితో కష్ట పడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయగలమన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రావణసేవ, నందిసేవ, రధోత్సవం, కళ్యాణోత్సవం సందర్భంగా ఎంత మంది వస్తారు అనే విషయంలో దేవాదాయ శాఖ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. వేసవి సందర్భంగా భక్తుల దాహర్తి తీర్చేందుకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని ఆలయ పరిసరాలలో షాపుల వారిని ఒప్పించి తాత్కాలికంగా ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. పవర్ కట్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యను అధిగమించడానికి అవసరానికి సరిపడా జనరేటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని కోరారు. ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగితే నివారించటానికి ఫైర్ ఇంజన్లు సిద్ధంగా వుంచుకోవాలనిస్నాన ఘట్టాల వద్ద ప్రమాదాలు నివారించేందుకు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలాన్నారు.పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వీలైనన్ని ఎక్కువగా మెడికల్ క్యాంప్స్ పెట్టండంతో పాటు అత్యవసర పరిస్థితులలో అంబులెన్సు అందుబాటులో ఉంకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.పెద్ద సంఖ్యలో హాజరయ్యే మహిళలను దృష్టిలో వుంచుకొని ఆకతాయిలు, అసాంఘిక శక్తుల పై ప్రత్యేక నిఘాతో పాటు ఎక్కువ ఏరియా కవర్ అయ్యేలా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులను కోరారు. ఆలయ పరిసరాలలో మద్యం విక్రయాలు జరగకుండా ఎక్సయిజ్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విఐపిల పేరుతో సామాన్య భక్తులకు ఎటువంటి యిబ్బందులు పెట్టవద్దని ఆలయ అధికారులు మరియు అర్చకులకు హితవు పలికారు. పార్కింగ్ సమస్య పై దష్టి సారించాలని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులు మరియు ఆలయ సేవా కమిటి సభ్యులను కోరారు. ఈ కార్యక్రమలో ఆర్ డి ఒ అనూష, ఆలయ ఇ ఒ శ్రీనివాసులు రెడ్డి, సేవా కమిటి చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..