

ఐరాల మన న్యూస్ మే 5: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామంలో ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యదర్శి సి అశోక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, స్థానిక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సి అశోక్ గ్రామ యువత మధు, పురుషోత్తం, ఉదయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చలివేంద్రం ఏర్పాటును హర్షంతో స్వాగతించారు. సామాజిక బాధ్యతకు నిదర్శనం ఈ చలి వేంద్రం
ఇటీవల పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో, ఈ తరహా ప్రజాప్రయోజన కార్యక్రమాలు అవసరమై ఉన్నాయి. పార్టీ మరియు పదవికి మించి సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు దగ్గరగా ఉండేలా బీజేపీ నేత ముందుకు రావడం అభినందనీయం. ప్రజల స్పందన:
చలివేంద్ర ప్రారంభమైన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నీరు సేవించారు. “ఇది ఎండాకాలంలో తాగునీటికి మాకొక ఆశ్రయం లాంటిది” అని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి మరిన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలు కొనసాగాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.