నెల్లూరు జిల్లా సైదాపురం మండలం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్

మన న్యూస్ ,నెల్లూరు ,మే 4: నెల్లూరు జిల్లా సైదాపురం మండలం లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి, వైయస్సార్ సిపి నాయకులు పి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా పి .అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ……..ఎన్నికలు గడిచి 10 నెలలు తర్వాత మీ ముందుకు వస్తున్నా…అనిల్ ఎక్కడకు వెళ్ళిపోలేదు,వ్యక్తిగత కారణాలో కొంచెం రోజులు దూరంగా ఉన్నా అంతే అని అన్నారు.ఎన్నికలు గడిచాక అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు రూపాయలు దోచుకున్నారని వ్రాశారు అని తెలియజేశారు.రెండు విషయాల పై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చా..మా జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు విషయం ఒకటి రెండోది అక్రమ మైనింగ్ పై అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని అధికారులు 255 కోట్ల రూపాయలు ఫైన్ లు వేశారు,ఆ ఫైన్ లు ప్రభుత్వం వసూళ్లు చేసుకోవాలి అని తెలిపారు.అధికారులు తనిఖీలు అనంతరం కొత్తగా మైన్ లు ఏమన్నా ఓపెన్ చేసారా?పెనాల్టీ లు వున్న మైన్ లు మాత్రమే మైన్ లు ఓపెన్ చేశారు అని అన్నారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి పై 150 నుండి 200 మైన్ లు వుంటే యాక్టివ్ గా 100 మైన్ లు ఉన్నాయి,కానీ కేవలం సెలెక్టివ్ గా 30 మైన్ లు మాతరమే మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారు… అని అన్నారు.గతం లో ప్రభుత్వానికి 300 కోట్లు రూపాయలు ఆదాయం వస్తె ఇప్పుడు 30 కోట్లు కూడా రావడం లేదు.. అని అన్నారు.లారీ డ్రైవర్ లు,కూలి పనుల చేసుకునే వారు, రైతులు,మైనింగ్ యజమానులు రోడ్డున పడ్డారు… అని అన్నారు.మైనింగ్ పరిశ్రమ పై బతికే 10 వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డారు… అని అన్నారు.
గతం లో మైనింగ్ లో జరిగిన తప్పు ఒప్పులు గురించి నేను మాట్లాడను.. అని అన్నారు.మైన్ ఓనర్లు కోర్టుకు వెళితే ఫిబ్రవరి లో మైన్ లు ఓపెన్ చేయాలని కోర్టు ఆదేశిస్తే అడ్డుకున్నారు,ఇప్పుడు మైన్ ఓనర్లు కంటెంట్ కింద కోర్టుకు వెళ్ళారు,గతం లో వైసిపి హయాం లో ఎప్పుడూ మైన్ ఓనర్లు కోర్టుకు వెళ్లలేదు… అని తెలియజేశారు.మైనింగ్ పరిశ్రమ ఓపెన్ చేయనీయకుండా,ఇతరులకు పర్మిట్లు రాకుండా చూస్తున్నారు,
నాకు వ్యక్తిత్వం గా ఎవరిమీద శత్రుత్వం లేదు…మైనింగ్ పరిశ్రమ ఓపెన్ చేయాలని ప్రభుత్వం అధికారులను,నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ కలిస్తే తొందర్లో లక్ష్మీ క్వార్జ్ ప్రైవేటు లిమిటెడ్ అనే పేరుతో కంపెనీ స్తాపించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు,ఆ కంపెనీ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుంది అని అన్నారు.తర్వాత ఫినీ క్వార్జ్ పేరుతో మరో కంపెనీ స్తాపించి మొత్తం ఒక్కరే ఎక్స్పోర్ట్ చేస్తునారు అని అన్నారు.పై రెండు కంపెనీలు స్థాపించి వారికి సరెండర్ చేసిన మైన్ లో నుండి సరుకు మాత్రం బయట వెళుతుంది,మిగతా మైన్ లు మూత బడ్డాయి అని తెలియజేశారు.20 నిండి 30 ఎక్స్పోర్ట్ కంపెనీలు అన్ని ఆగిపోయి ఒక్క అధికార పార్టీ కి చెందిన ఎంపీ కి చెందిన ఎక్స్పోర్ట్ కంపెనీ సరుకు మాత్రమే బయట వెళుతుంది అని అన్నారు.శతాబ్దాలు చరిత్ర కలిగిన వెంకటగిరి రాజా గారు కూడా మైన్ ఓపెన్ చేయాలి అని తెలియజేశారు.పేద ప్రజల ఉసురు వీళ్ళకు కచ్చితంగా తగులుతుంది అని అన్నారు.మైన్ ఓనర్లు కన్నా దానిమీద బతికే పేదవాడి కడుపు మీద కొట్టిన పాపం వూరికే పోదు అని అన్నారు.గతం లో 250 కోట్లు ఫైన్ వేశారు…శోభారాణి మైన్ కు 32 కోట్లు ఫైన్ వేశారు,ఈ మైన్ ఇల్లీగల్ అని వెంకటగిరి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ కూడా పెట్టారు అనే తెలియజేశారు.నెల్లూరు డిడి ఎంత దారుణం గా ఉన్నాడు అంటే ఆయన మొదట AD గా వున్నప్పుడు 38 వేల మెట్రిక్ టన్నులు వున్నది అని MRO,RI లు అందరూ పంచనామ రాసారు,కానీ ఇదే DD వచ్చాక మైనింగ్ చేయకుండానే లక్షా 20 వేల టన్నులు వున్నది అని రిపోర్ట్ ఇచ్చారు అంటే ఏమి చెప్పాలి అని తెలియజేశారు.సిద్ధి వినాయక,శ్రీనివాస పద్మావతి,శోభారాణి మైన్ లు 50 సంవత్సరాలు గడిచి పోయిన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అని అన్నారు.లీజు ముగిసిన మైన్ లలో మెటీరియల్ ప్రభుత్వం ఆక్షన్ పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది,ప్రస్తుతం అక్కడ సరుకు లక్షల టన్నులు ఉంది దాని విలువ మార్కెట్ పరికరం 800 నిండి 2000 వేల కోట్లు రూపాయలు వరకు వుంటుంది,ఆ డబ్బులు రాజధాని అమరావతి కోసం వియోగ పడుతుంది అని అన్నారు.మైన్ లో ఇల్లీగల్ జరుగుతుంది అని పత్రికా మిత్రులు వెళితే అక్కడ గంజాయి బ్యాచ్,రౌడీ షీటర్ లు కపాలా కాస్తున్నారు,అమరనాథ్ రెడ్డి అనే వ్యక్తి పై ఈ ప్రభుత్వం లో అక్రమ మైన్ చేస్తున్నారని కేసులు పెట్టారు,ఇప్పుడు అతనే అక్కడ ఇల్లీగల్ మైన్ చేస్తున్నారు అని అన్నారు.జిల్లా ఎస్పీ ఎవరినైనా మఫ్టీ లో పంపితే అక్కడ పరిస్థితులు తెలుస్తాయి అని అన్నారు.
అక్రమ మైనింగ్ ఆపాలంటూ ఒక మహిళ పోరాటం చేస్తున్నారు,సైదాపురం ఎస్సై దారుణం గా ప్రవర్తిస్తున్నారు,దారుణంగా దారిని పోయే వారిని గంజాయి బ్యాచ్ లు ఆపి అక్రమాలు చేస్తుంటే ఎస్సై కు కనిపించవా అని తెలిపారు.నీకు 5వేల కోట్లు ఉందో మూడు వేల కోట్లు ఉందో తెలియదు కానీ పేదల ఉసురు తగులుతుంది అని అన్నారు.వేమిరెడ్డి మోనో పోలి లాగా పని చేస్తున్నారు అని తెలిపారు.ఇంత చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై ఎందుకు కేసు పెట్టకూడదు అని అన్నారు.పేదోడి పై రైతుల పై కేసులు కడుతున్నారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై ఎందుకు కేసు కట్టకూడదు అని అన్నారు.ఒక ఎంపీ గా ఇంత అక్రమాలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధి గా వేమిరెడ్డి ఎందుకు ఖండించడం లేదు అని అన్నారు.
వేమిరెడ్డి ఏమన్నా భగవంతుడా?వేమిరెడ్డి నేరుగా నాకు సంబంధం లేదని చెప్పమనండి… అని తెలియజేశారు.మరో 5 రోజుల్లో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోక పోతే నేనే అక్రమ మైనింగ్ వద్దకు వెళతా …వీళ్ళు ఇదే విధంగా ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తా అంటే అక్కడ ఉన్న స్థానికులు అందరూ మైనింగ్ చేసుకుంటారు,MDL ఉన్నవారు అందరికీ లక్షల రూపాయలు పెనాల్టీ లు వేశారు,కోటీశ్వరులు కు మాత్రం పెనాల్టీ లు లేవు అని తెలియజేశారు.MDL పెట్టుకుని మైనింగ్ లో ఇబ్బంది పడుతున్న వారిలో 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ వారే… అని తెలిపారు.రాజకీయ నాయకులు ఎన్నో మాట్లాడతారు,కానీ చివరగా పేదవారు నష్ట పోతున్నారు…. అని తెలియజేశారు.

Related Posts

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

  • By JALAIAH
  • September 14, 2025
  • 4 views
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

  • By JALAIAH
  • September 14, 2025
  • 5 views
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి