

మన న్యూస్, కావలి ,మే 3: కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తట్టవర్తి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ………. 2025 సంవత్సరానికి10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డలకు మే 4వ తేదీ ఆదివారం ఉదయం 09:00 లకు కావలి బాపూజీ నగర్ మున్సిపల్ ప్లాట్స్ యందు రెండవ పడమర అడ్డరోడ్డు లోగల ఆర్యవైశ్య సంఘం ఆఫీసు నందు
ఆర్యవైశ్య ముద్దు బిడ్డలందరికీ ప్రతిభ పురస్కారము అవార్డులు ప్రధానం చేయుచున్నాము అని తెలియజేశారు. కావున అవార్డు గ్రహీతలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేయగలరు కోరారు. అలాగే ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయగలరు మనవి చేశారు.