మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 3:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 11మందికి మంజూరైన షూమారు రూ.12 లక్షల రూపాయల చెక్కులను బాధితులకు అందజేసిన నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం మంజూరు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి మా ప్రత్యేక ధన్యవాదములు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ నంది మండలం భాను శ్రీ, క్లస్టర్ ఇంచార్జ్లు మన్నెం పెంచలనాయుడు, మన్నేపల్లి రఘు, కనపర్తి గంగాధర్, నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల,26 వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు బూడిద పురుషోత్తం యాదవ్, 30వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు అత్తివరపు యనాదయ్య, 31వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు కూకటి హరిబాబు యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *