

మన న్యూస్ సింగరాయకొండ:- పంచాయతీ రాజ్ విభాగంలో 33 సంవత్సరాల పాటు సేవలు అందించిన అసిస్టెంట్ ఇంజినీర్ కొటా శ్రీహరి పదవి విరమణ చేసిన సందర్భంగా, సింగరాయకొండ మండల ఎంపీడీఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కట్టా శోభారాణి, ఎంపీడీఓ జయమణి, జరుగుమల్లి మండల ఎంపీపీ బెల్లం సత్యం, నిర్మల, ముళ్ళపూడి సత్యనారాయణ, షేక్ నాసీర్, పంచాయతీ కార్యదర్శలు, ఇంజనీరింగ్ సహాయకులు తదితరులు హాజరై, పదవీ విరమణ చేసిన శ్రీహరినీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.