

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,ఏప్రిల్ 30:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ లో ముత్తుకూరు గేటు వద్ద 89 లక్షల రూపాయల వ్యయంతోఫ్లైఓవర్ బ్యూటీఫికేషన్ పనులకు బుధవారం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 19వ డివిజన్ లో ఇప్పటికే అభివృద్ధి పనులకు దాదాపుగా 6 కోట్ల రూపాయల నిధులను కేటాయించాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, యువనేత నారా లోకేష్ కి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కి మరియు అధికారులకు ధన్యవాదాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్ల లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మే 15వ తేదీ 330 అభివృద్ధి పనులు 606 మంది కార్యకర్తల చేత ప్రారంభోత్సవాలు చేస్తారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతి ప్రియ, తెలుగుదేశం పార్టీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, జనసేన మరియు బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
