

నెల్లూరు మన న్యూస్: ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా వ్యవస్థాపక,జాతీయ అధ్యక్షులు పులగర శోభనబాబు అధ్యక్షతన మంగళవారం నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజాసత్తా మహిళా కమిటీ ఏర్పాటు సందర్భంగా విలేకరుల సమావేశం జరిగినది. ఈసందర్భంగా ప్రజాసత్తా వ్యవస్థాపక,అధ్యక్షులు పులగర శోభన బాబు మాట్లాడుతూ ప్రజాసత్తా ఆధ్వర్యంలో 2004 నుండి కుల,మత,వర్గ, రాజకీయాలకు అతీతంగా మహిళల సంక్షేమమే లక్ష్యంగా,అభివృద్దే ఆశయంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజాసత్తా ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం, అనుభందం లేని ఒక సేవా సంస్థ అని తెలిపారు.మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమాన ప్రాతిపదికన ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని 2004 నుండి ప్రజాసత్తా పోరాట పటిమతో పనిచేసినట్లు గుర్తు చేశారు.బాల్యవివాహాలపై, బాలికల విద్య కోసం నిర్విరామ కృషి చేస్తున్నట్లు తెలిపారు.వితంతువుల, వయోవృద్ధులు,దివ్యాంగులైన, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన మహిళలకు సేవలు అందిస్తున్నట్లు పులగర పేర్కొన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు,రాయితీలపై అవగాహన కల్పిస్తూ అర్హులైన వారికి అందించుటలో వివిధ పార్టీల నాయకుల,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అందిస్తున్న సహకారాలకు కృతజ్ఞతలు శోభనబాబు తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడం అభినందనీయం అన్నారు.నెల్లూరు నగర, నెల్లూరు రూరల్ పరిధిలలోని అన్ని డివిజన్లలో,వార్డుల్లో, జిల్లాలోని అన్ని మండలాలలో ప్రజాసత్తా కమిటీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మహిళలు వ్యక్తిగత,కుటుంబ,సామాజిక,ఆర్థిక,ఆరోగ్య,విద్య,వైద్య,రెవెన్యూ, లీగల్,సివిల్ సమస్యలపై మరియు సభ్యత్వంల కొరకు 9989385993 నంబరును సంప్రదించాలని సూచించారు.
ప్రజాసత్తా నెల్లూరు పార్లమెంటరీ మహిళా కమిటీ ఏర్పాటు:: అధ్యక్షురాలుగా షేక్ షబానా, ఉపాధ్యక్షులుగా యస్ కె మహాతాజ్,కార్యదర్శిగా షేక్ గుల్హన్ బేగం,సహాయ కార్యదర్శిగా ఎస్ కె అర్షియ,కోశాధికారిగా షేక్ గౌసియాభేగం,కన్వీనర్ గా షేక్ నౌషీన్,కో-కన్వీనర్ గా ఎస్ కె జాహిద, జనరల్ సెక్రటరీగా పి.గౌసియా,కో-ఆర్డినేటర్ గా షేక్ గౌసియా, కార్యవర్గ సభ్యులుగా గౌసీయా లను ఏకగ్రీవంగా పులగర శోభన బాబు ఎంపిక చేశారు. ఈసందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన షేక్ షబాన మాట్లాడుతూ ఒంటరి మహిళా పింఛన్లు 40 సంవత్సరాలకే ఇవ్వాలని,నిరుపేద మహిళలకు ఇళ్ళ స్థలాలు,వివిధ రుణాలు,అనాధ మహిళలకు ప్రభుత్వ ఆశ్రమాలు, నిరుద్యోగు మహిళలకు ఉద్యోగ,ఉపాధి, నిరుద్యోగభృతి,చేతివృత్తుల వారికి ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉచిత కుట్టు మిషన్లు మరియు వివిధ చేతివృత్తుల పరికరాలను అందించాలని కోరారు.మహిళా కమిటీలలో సమాజసేవ ఆ దృక్పథం కలిగిన మహిళలు, విద్యార్థినిలు,నిరుద్యోగయువతులు,గృహిణులు,ప్రభుత్వ,ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న మహిళలు సభ్యులుగా చేయవచ్చునని సూచించారు.