

మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 27: వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేయడంలో మందలపు మోహన్ రావు కీలక పాత్ర వహించారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందటంలో ముందలపు మోహన్ రావు పాత్ర ఎంతో కీలకంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను గుర్తించిన తిరుపతి సిటీ ఛాంబర్ మందలపు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అందజేశారు. మహతి ఆడిటోరియంలో ఆదివారం తిరుపతి సిటీ చాంబర్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సామాజిక సేవకులు మందలపు మోహన్ రావుకు దుశాలవతో ఘనంగా సత్కరించి లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, మోహన్, పరసారత్నం, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి సిటీ చాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, సిటీ ఛాంబర్ చైర్మన్ కేఎస్ వాసు, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, బాలాజీ జ్యువెలర్స్ అధినేత సత్యనారాయణ (బాబు) పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
