

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 28: బద్వేల్ 132 కెవి సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా సోమవారం సాయంకాలం 3.00 ల నుండి 06.30 గo. ల వరకు బద్వేలు,గోపవరం, అట్లూరు మరియు B. మట్టం మండలాలలో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ భరణికృష్ణ,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం కూలయప్ప తెలియచేశారు.వినియోగదారులు సహకరించవలసినదిగా కోరడమైనది.