

మన న్యూస్, గూడూరు :- చెన్నూరు వాసి NRI అయినటువంటి జక్కంరెడ్డి శశాంక్ రెడ్డి సహకారంతో, GRCC డైరెక్టర్ రామ్ గోపాల్ పర్యవేక్షణలో గూడూరు రూరల్ గ్రామం చెన్నూరులో క్రికెట్ “సూపర్ 30” టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం అయ్యింది. ప్రతిభావంతులైన 15 సంత్సరాల లోపు క్రికెట్ ఆటగాళ్ళను గూడూరు రూరల్ పరిధిలో గుర్తించి వారిలో 30 మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ళను ఎంపిక చేసి వారికి సీనియర్ నాణ్యమైన కోచ్ లతో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ మరియు ఉచిత క్రికెట్ కిట్లు ఇవ్వనున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,నిరుపేద ఆటగాళ్ళను గుర్తించి వారిని ప్రోత్సహించడం తమ సూపర్ 30 యొక్క ఉద్దేశమని కార్యక్రమ నిర్వాహకులు జక్కంరెడ్డి శశాంక్ రెడ్డి చరవాణి ద్వారా మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో NDCA జాయింట్ సెక్రటరీ మస్తానయ్య,GRCC డైరెక్టర్ రామ్ గోపాల్,అవినాష్, బెంగుళూరు కోచ్ లు రాజీవ్, దీపక్ మల్లా, ఆటగాళ్లు మరియు తల్లితండ్రులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.
