

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి నగరంలోని వేదం మొబైల్స్ 24 వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదం మొబైల్స్ అధినేత ఆముదాల ప్రభాకర్ మాట్లాడుతూ 24 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను కస్టమర్ల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆఫర్లతో పాటు ప్రత్యేక రాయితీలు, గిఫ్ట్లు కూడా మా షో రూమ్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. మా 24 సంవత్సరాలలో వేదం మొబైల్స్ ఉన్నతకి తోడ్పడిన కస్టమర్ల అందరికీ, నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.