మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 24:– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్థశ పట్టిందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. భవిష్యత్తులో కోవూరు నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయిలో తొలిర్యాంకు సాధించేలా చూడాలన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విపిఆర్‌ నివాసంలో ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు.. ఆమె ఆశీసులు అందుకున్నారు. అలాగే ఇందుకూరుపేట మండలంలో 593 మార్కులతో తొలిస్థానం సాధించిన గుడి భార్గవ్‌ అనే విద్యార్థికి టిడిపి నాయకులు దాసరి విజయ్‌ తన భార్య జ్ఞాపకార్థం 25 వేల నగదు బహుమతిని ఎమ్మెల్యే చేతులమీదుగా అందించారు. అలాగే మండలానికి చెందిన టిడిపి నాయకులు సతీష్‌.. 591 మార్కులు సాధించిన నేహా పర్విన్‌కు సిగమాల పుల్లమ్మ జ్ఞాపకార్థం 10 వేల పురస్కారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందించి ప్రోత్సహించారు. ఇక అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్ తరుపున ఎమ్మెల్యే చేతుల మీదుగా 586 మార్కులు వచ్చిన నెల్లూరు హారికకు ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ 5 వేల రూపాయలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించి పురస్కారాలు అందించడం గొప్ప విషయమన్నారు. ఇంతబాగా చదువు చెబుతున్నందుకు ఉపాధ్యాయులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్‌ సహకారంతో నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ట్రిపుల్‌ ఐటీల్లో సీటు సాధించేలా విద్యార్థులను గైడ్‌ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///