

మన న్యూస్,కోవూరు,ఏప్రిల్ 24:– ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 597 మార్కులతో 4వ ర్యాంకు సాధించిన కొడవలూరు మండలానికి చెందిన పల్లంరెడ్డి సురేష్‌రెడ్డి కుమార్తె పల్లంరెడ్డి ఇందుప్రియను కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో ఎమ్మెల్యేను కలిసిన వారు.. ఈ సందర్భంగా ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నియొజకవర్గానికి చెందిన విద్యార్థిని రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
