మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 23 :- వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నెల్లూరు వి ఆర్ సి సెంటర్ లో జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ….. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు.
దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. కొవ్వొత్తులు ప్రదర్శించి.. నివాళి అర్పించారు. అమాయక పర్యాటకులపై.. పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన.. దాడి పిరికిపంద చర్యగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అభివర్ణించారు.పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్యఅని అన్నారు.ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకుడదని అన్నారు.
ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు.రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముష్కర ముకలను ఆట కట్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *