

- ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యం…
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో మాధురి విద్యాలయం విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదవ తరగతి పరీక్షలకు 59 మంది విద్యార్థులు హాజరుకాగా 59 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మాదేపల్లి శ్రీ గాయత్రి లక్ష్మి తులసి 583/600 ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, పడాల వెంకట మణి వరలక్ష్మీదేవి 575/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. కడుపు కుట్ల పార్థ సత్య వేణు అవినాష్ 572/600 సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రతిభను కనబరిచిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అభినందించారు. మిగతా 38 మంది విద్యార్థిని విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా మాధురి విద్యాసంస్థల సిబ్బంది పలువురు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.