

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 23:- జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పర్యాటకులపై జరిగిన ఈ కిరాతక దాడిని ముష్కర మూకల పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. దేశ సమైక్యతను దెబ్బతీసే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించరాదన్నారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ దాడి దేశ శాంతి భద్రతలను భంగ పరిచే చర్యగా అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా, ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడవలసిన సమయం ఇదన్నారు. ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగే విదంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తెసుకోవాలని కోరారు. ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి..క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.