mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. అయితే విద్య అనేది వ్యాపారంల మారకూడదు అనే ఉదేశ్యంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో కర్ణాటకలోని ప్రైవేట్, నాన్ ఎయిడెడ్ స్కూల్స్ 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో విద్యాశాఖ కీలకమైన మార్పులు చేసింది. దింతో స్కూల్స్ ఏ సిలబస్ అనుసరించినా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్ల పై కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. తప్పనిసరిగా ఉండాల్సిన వివరాలు
ఇకపై స్కూల్స్ అడ్మిషన్ల షెడ్యూల్, ఒక్కో క్లాసులో ఉన్న సీట్ల సంఖ్య, టీచింగ్ విధానం ఇంకా ఫీజుల వివరాలను తప్పనిసరిగా స్కూల్ నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి. అంతేకాకుండా ఈ సమాచారం స్కూల్ వెబ్సైట్, SATS పోర్టల్ అండ్ ప్రాస్పెక్టస్‌లో కూడా తప్పసరిగా ఉంచాలి. బాలికలకు ప్రత్యేక రిజర్వేషన్లు: కో-ఎడ్యుకేషన్ స్కూళ్లలో బాలికలకు 50% సీట్లు రిజర్వ్ చేసింది. ఒకవేళ తక్కువ మంది బాలికలు అడ్మిషన్ కోసం అప్లయ్ చేసుకుంటే మిగిలిన ఆ సీట్లను బాలురకు కేటాయించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. ఫీజుల విషయంలో స్పష్టత
స్కూల్ విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజుల వివరాలను ముందుగానే ప్రకటించాలి. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కాకుండా ఇతర అదనపు ఛార్జీలు లేదా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇంటర్వ్యూలకు స్వస్తి: అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకి లేదా వారి తల్లిదండ్రులకి ఇంటర్వ్యూ చేయడం ఇకపై నిషేధం. ఈ నిబంధనను ఉల్లంఘించిన స్కూళ్ల పై కూడా చర్యలు తప్పవు.