

Mana News :- నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మేము ఏం ఎచీవ్ చేస్తామని అనుకున్నామో, అది ఈ సినిమాతో సాధించాం. ఆడియన్స్ ప్రతి సీక్వెన్స్ బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. క్లైమాక్స్ గూస్ బంప్స్ అంటున్నారు. అలాంటి క్లైమాక్స్ ని ఒప్పుకున్నా కళ్యాణ్ రామ్ గారికి థాంక్యూ. ఆయన నమ్మకపోతే ఈ సినిమా లేదు. పృథ్వి గారు, శ్రీకాంత్ గారికి థాంక్యూ. విజయశాంతి మేడం గారు చాలా కష్టపడ్డారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మా ఫైట్ మా ఫైట్ మార్ట్ మాస్టర్స్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. మా ఎడిటర్ తమ్మిరాజు గారు మొదట్నుంచి సపోర్ట్ చేశారు. సినిమాకి ఆడియన్స్ రివ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఆడియన్స్ కి సినిమా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్యూ’అన్నారు.
