చంద్రబాబు – ఉద్యోగాల కల్పతరువు-డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

Mana News , శ్రీకాళహస్తి :- ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని తుచ తప్పకుండా అమలు చేసి, చెప్పిన విధంగానే మెగా డియస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు చంద్రబాబు ఉద్యోగాల కల్పతరువులా నిలుస్తున్నాడని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల్లో పోస్టింగులు ఇచ్చేలా చర్యలు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఉద్యోగార్ధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. 2014-2019 మధ్యకాలంలో 18 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసిన చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న తన హయాంలో డీఎస్సీ ప్రక్రియను చేపట్టి, 11 నోటిఫికేషన్ల ద్వారా 1,80,208 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి, లక్షలాది కుటుంబాలలో వెలుగులు నింపిన గొప్ప మానవతా మూర్తి మన చంద్రబాబు అని కొనియాడారు. ఇప్పుడున్న టీచర్లలో ఎక్కువమంది చంద్రబాబు హయాంలో పోస్ట్ లు పొందినవారే అని గుర్తు చేశారు. జగన్ దగాకు – చంద్రబాబు విరుగుడు మోసపూరిత మాటలు చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని భ్రమలో పెట్టి 2019 లో అధికారం చేపట్టిన తరువాత జగన్ చేసిన దగాకోరు పనులకు చంద్రబాబు విరుగుడు చేస్తున్నాడని కొనియాడారు. సీఎం కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ అని ఎన్నికల సయయంలో హామీ ఇచ్చిన జగన్ రెడ్డి సీఎం అయ్యాక టీచర్ల భర్తీని అటకెక్కించేశారని ఆరోపించారు. జంబో డీఎస్సీ, మెగా డీఎస్సీ అంటూ 5 ఏళ్ల పాటు విద్యార్థుల జీవితాలతో ఆటలాడి, 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 6100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించి, నోటిఫికేషన్ రిలీజైన 30 రోజుల్లోనే పరీక్షలంటూ మెలిక పెట్టిన మహా మాయగాడు జగన్ అని దుయ్యబట్టారు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టించడం, అప్రెంటీస్ విధానం అంటూ పిచ్చి పిచ్చి చేష్ఠలతో నిరుద్యోగులను వంచించిన మోసగాడు జగన్ రెడ్డి అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి, తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,బిసి నాయకుడు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రత్యేక శ్రద్ధ, విలువైన విద్య పోటీ పరీక్షలలో ప్రథమ ఫలితాలు మాధురి విద్యాసంస్థలకే సాధ్యమని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో…

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

శంఖవరం మన న్యూస్ (అపురూప్): రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేసింది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

  • By APUROOP
  • April 24, 2025
  • 2 views
పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

  • By APUROOP
  • April 24, 2025
  • 4 views
కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

  • By APUROOP
  • April 24, 2025
  • 3 views
ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

  • By APUROOP
  • April 24, 2025
  • 2 views
శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్

ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్