

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఏలేశ్వరం మండలం ఉపాధ్యక్షుడు గొడుగు నల్లబ్బాయి సారధ్యంలో వేడుకలు నిర్వహించారు.జయంతి వేడుకలకు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకటరావు హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉమ్మిడి వెంకట్రావు మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ సభ్యులు బండారు సూర్యనారాయణ,బిరుసు నాగేశ్వరరావు,ఎర్రబెల్లి గంగారావు,భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.అలాగే ప్రత్తిపాడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి పురస్కరించుకుని దాసరి సత్తిబాబు పిలుపు మేరకు వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు,మండల అధ్యక్షుడు ఊటా వీరబాబు, మండల ఉపాధ్యక్షులు నానిపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మూరా నాగేంద్ర, శేఖర్,కడారి నాగేశ్వరరావు,జై భీమ్ యూత్ తదితరులు పాల్గొన్నారు