

కలిగిరి మన న్యూస్ :: బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 135వ జయంతి సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం పి ఓ సి కొట్టే వెంకటేశ్వర్లుగారు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అణచవేతకు గురైన వర్గాల ప్రతినిధిగా అంబేద్కర్ గారు వయోజన ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసి ఓటు హక్కు కల్పించారు బహుముఖ ప్రజ్ఞాశాలి అణగారిన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించాడు భారత స్వాతంత్ర సమరయోధుడు వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కలిగిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు బండారు లక్ష్మీనారాయణ కోసూరి సురేష్ చల్లా వెంకీ ఈర్నాల కృష్ణ జొన్నలగడ్డ కేశవరావు, నాగదాసరి రమేష్,కంభం ప్రసాద్ మురారి పెంచాలబాబు,పైడి మాల్యాద్రి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.