శ్రీకాళహస్తి, మన న్యూస్: .తండ్రికి తగ్గ తనయుడుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలచేత మన్ననలు పొందిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా కల్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు పేర్కొన్నారు.తన తండ్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి సందర్బంగా శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సుధీర్ రెడ్డి చేస్తున్న గొప్ప కార్యక్రమంలో ఎల్లుండి, అనగా 15-04-2025 వ తేదీన, తొట్టంబేడు గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద గల యస్.యస్.కళ్యాణ మండపం దగ్గరకు విచ్చేయమని పలువురు నిరుద్యోగ యువతీ యువకులను కలిసి వివరించారు.మాజీ మంత్రి,స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన పరిపాలనా కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అనేక పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేసి, శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని ఉద్యోగ కల్పనా కేంద్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, మైనారిటీ విభాగం నాయకులు సయ్యద్ చాంద్ బాషా, షేక్ జిలానీ, షేక్ రియాజ్, షేక్ జమీర్, ఇర్షాద్, షహాద్, మీర్జావలీ, ఫర్హా, యస్టీ విభాగం నాయకులు మునిరాజా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *