భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి,,సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర

మనన్యూస్,సింగరాయకొండ:సోమరాజు పల్లి పంచాయతీ పరిధి తిరుమల పట్టాభి నగర్ నందు మహిళలు ఏర్పాటు చేసుకున్న బీమ్ రావ్ అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింగరాయకొండ సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్ర మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకు అందించిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు.ఈ గ్రామంలో మహిళలు ముందుకు వచ్చి అంబేద్కర్ జయంతి వేడుకలు చేసుకోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇది శుభ పరిణామం అన్నారు.విద్యార్థులు చదువుతోపాటుగా కాంపిటేషన్ ఎగ్జామ్స్ వైపు దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుచూ బిడ్డ మానసిక ఎదుగుదలకు తల్లి ప్రధాన కారణమని ఎటువంటి మానసిక ఒత్తిడి లేని, క్రమశిక్షణతో కూడిన మంచి భవిష్యత్తును అందించాలని అన్నారు.
అదే విధంగా ఎన్నో అవమానాలను భరించి,తనకు విద్య మాత్రమే ఉన్నత స్థానం దక్కిస్తుందని భావించి అత్యున్నత జ్ఞానసంపత్తితో ప్రపంచములో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.కమిటీ సభ్యులు సబ్ ఇన్స్పెక్టర్ మహేంద్రను న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు చాలువతో సన్మానించగ కార్యక్రమంలో బీమ్ రావ్ అంబేద్కర్ కమిటీ సభ్యులు నూతలపాటి శైలజ, స్వర్ణలత,పులి వాణి, పురగంటి సువర్ణ, కడియం శ్రీలత, ప్రసన్న,మేడికొండ నాగమణి మరియు పెద్దలు పాల్గొన్నారు

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!