క్యాచ్ వదిలేస్తే అంతే సంగతులు.. కోహ్లీ స్టైల్లో వార్నింగ్!

Mana News :- ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన 20వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్‌తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో కనిపించాడు. అతను తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించాడు. ఇది నిజంగా చూస్తున్న అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. విరాట్ కోహ్లీ మొదట తాను అవుటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాట్‌ను విసిరికొట్టాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తన టోపీని కోపంతో నేలకేసి కొట్టాడు. అసలు గ్రౌండ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం! కోహ్లీకి కోపం వచ్చింది :- ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లోని 12వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ తన సహనం కోల్పోయాడు. దీనికి కారణం ఆర్‌సీబీలోని ఇద్దరు ఆటగాళ్ల పిల్ల చేష్టలు. వాస్తవానికి 12వ ఓవర్‌లో యష్ దయాల్ వేసిన రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్ బంతిని గాల్లోకి లేపాడు. యష్ దయాల్ దగ్గరే ఈజీ క్యాచ్ ఉంది. కానీ అప్పుడే వికెట్ కీపర్ జితేష్ శర్మ అక్కడికి వచ్చి అతడిని ఢీకొట్టడంతో క్యాచ్ జారిపోయింది. బంతి చాలా ఎత్తుకు వెళ్లడంతో వికెట్ కీపర్ జితేష్ శర్మ క్యాచ్ పట్టాలని ప్రయత్నించాడు. కానీ యష్ దయాల్ అతని పిలుపును వినలేదు. దీని వల్ల ఆర్‌సీబీకి నష్టం జరిగింది. ఇదంతా చూస్తున్న విరాట్ కోహ్లీ ఈ తప్పిదం తర్వాత తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు.వికెట్ దక్కింది :- అయితే విరాట్ కోహ్లీ కోపం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అదే యష్ దయాల్ ఓవర్‌లో అవుటయ్యాడు. యష్ దయాల్ వేసిన చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ మళ్లీ గాల్లోకి షాట్ ఆడగా లివింగ్‌స్టోన్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో విరాట్ కోహ్లీ కోపం కొంచెం తగ్గింది.అవుటయ్యాక కూడా ఆగ్రహం :- వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. కానీ తాను అవుటైన తర్వాత తీవ్ర అసహనంతో కనిపించాడు. అవుటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి తన బ్యాట్‌ను విసిరికొట్టాడు. ఆ తర్వాత గ్లవ్స్‌ను కూడా విసిరేశాడు. తల పట్టుకుని కూర్చుండిపోయాడు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!