రాప్తాడులో ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్‌తో పోలీసుల ఓవరాక్షన్‌

Mana News, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తున్న గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పోలీసుల అనుమతి కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. తనును కావాలనే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ..’రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య దారుణ హత్యను ఖండిస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ బీసీ నేతలను టార్గెట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో హింసా రాజకీయాలు లేవు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ మొదలు పెట్టారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం దుర్మార్గం అంటే కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. కురుబ లింగమయ్య దారుణ హత్యను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా తోపుదుర్తి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో కీలకంగా ఉన్నందుకే లింగమయ్యను హత్య చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత హత్యా రాజకీయాలు చేస్తున్నారు. పరిటాల సునీతకు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అంతకుముందు.. రాప్తాడు నియోజకవర్గంలో కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఉగాది సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా టీడీపీ నేతలు.. లింగమయ్యపై దాడి చేశారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ లింగమయ్య ఆసుపత్రిలో మృతి చెందారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఘటన జరిగింది. దీంతో, లింగమయ్య కుటుంబ సభ్యులు.. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులపై ఫిర్యాదు చేశారు. లింగమయ్య హత్యకు టీడీపీ నేతలు రమేష్, సురేష్, ఆదర్శ్, ఆదిత్య, మనోజ్ నాయుడు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు