

Mana News :- అమరావతి: నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైలు టెండర్లు పూర్తి యాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఫైనాన్షియల్ సిటీ విశాఖ మాస్టర్ ప్లాన్‌పై సమీక్షించినట్లు తెలిపారు. ప్రజలు, నేతల అభిప్రాయాలతో నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రో రైల్‌పైనా సమావేశంలో చర్చించామన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో గతంలో అక్రమాలు జరిగాయని.. విశాఖలో 600కు పైగా టీడీఆర్ బాండ్లు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. వీటిని విశాఖ కలెక్టర్ త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. వైకాపా హయాంలో మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా డీవియేషన్ జరిగిందని మంత్రి తెలిపారు.
