

ఉదయగిరి,మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో వై సి పి ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వై సి పి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మేరీగ మురళీధర్* గారితో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా స్థానిక వైసిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…… వరికుంటపాడు మండల వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, నాయకుల సంక్షేమానికి రాబోయే రోజుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలిపారు.కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు జగన్ మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేసి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా నడుచుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో నాయకులు కార్యకర్తలు తలెత్తుకొని తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండబోతుందని తెలిపారు.మాట చెప్పాడు అంటే దాని కోసం ఎంత దూరమైనా వచ్చే దమ్ము, ధైర్యం కలవాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని.. కార్యకర్తలందరికీ గుర్తు చేశారు.ప్రజలు తెలుగు దేశానికి 164 సీట్లు ఇస్తే.. ఈరోజు ఆ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయి.. ప్రజాగ్రహానికి గురవుతుందన్నారు. ఈ రోజు దోచుకోవడానికి అధికారంలోకి వచ్చామన్న విధంగా ఆపార్టీ వ్యవహరిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం సాగదని.. తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్పడవద్దని..కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరిగిన వారికి అండగా నిలబడి పోరాటం సాగించేందుకు పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా కల్పించారు.పార్టీ కార్యకర్తలు, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ని ఆప్యాయంగా పలకరించారు.
