వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూములలో జరిగిన భారీ దోపిడీ పై నెల్లూరుజిల్లా YSRCP అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పరిశీలించిన MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

ఉదయగిరి,మన న్యూస్ మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను నెల్లూరుజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్, ఉదయగిరి వై సి పి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తో కలిసి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు సి ఐ డి అండర్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో కోట్ల రూపాయల విలువ చేసే జామాయిల్ చెట్లను యదేచ్చగా నరికి అమ్మి సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని మీడియాకు వివరించారు. ఒక్క వరికుంటపాడు మండలంలోనే అగ్రిగోల్డ్ కు సంబంధించి భూముల్లో కలపను అమ్మి టిడిపి నేతలుమూడున్నర కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డారని జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.పేదలకు చెందాల్సిన అగ్రిగోల్డ్ భూములను ఇలా అక్రమంగా బక్షిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ……….పేదలకు చెందాల్సిన అగ్రిగోల్డ్ భూముల్లో యదేచ్చగా అక్రమాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా అని మండిపడ్డారు .అగ్రిగోల్డ్ భూముల్లో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతుంటే రెవెన్యూ, పోలీసు వ్యవస్థల కళ్ళకు కనపడటం లేదా అని ప్రశ్నించారు.ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల్లో 60 ఎకరాల్లో కలపను అక్రమంగా అమ్మి టీడిపి నేతలు పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు.అధికారుల కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న భూముల్లోనే ఇలా జరిగిందంటే ప్రజల ఆస్తులకు ఎలాంటి రక్షణ ఉంటుందో అర్థం కావడం లేదన్నారు.తెలుగుదేశం పార్టీ నేతలే ఇలాంటి దోపిడీలకు పాల్పడుతుంటే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసిందన్నారు.ఇంత జరుగుతున్న ప్రభుత్వం మౌనం పాటిస్తుందంటే రేపు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు రక్షణ ఉంటుందా అన్న సందేహం ప్రజల్లో ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నారు.ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు.. చోటు చేసుకో లేదన్నారు.ఇప్పటికైనా ప్రజలు ఏకతాటిపై కొచ్చి.. తమకు జరుగుతున్న అన్యాయాలను.. అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం వారు వరికుంటపాడు తహసిల్దార్ ను కలిసి అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…