

Mana News :- ఏపీలో జనసేన పార్టీ ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. 2014లో ప్రస్ధానం ఆవిర్భవించిన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ల ప్రస్ధానంలో బలీయమైన శక్తిగా నిలబెట్టారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ విజయం చరిత్రలో నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పిఠాపురంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జనసేనకు శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోతో కూడిన ట్వీట్ చేసిన నారా లోకేష్.. ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. పవన్ పిడికిలి బిగించిన ఫొటోను ఇందులో లింక్ చేశారు. అందులో సాధించిన విజయాలు స్మరించుకుందాం..భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం అంటూ జనసేన ఆవిర్భావ సభ థీమ్ ను పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లుగా ఈ ఫొటో ఉంది. ఈ ఫొటోను తన ట్వీట్ కు లింక్ చేసిన లోకేష్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
