మన న్యూస్ (శృంగవరపుకోట) ; శృంగవరపు కోట పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు మహాఅవతార్ బాబాజీ వారి ధ్యాన మందిరం గురువులైన శ్రీరాం బాబాజీ శ్రీ లక్ష్మీ మాతాజీ ఆధ్వర్యంలో పౌర్ణమి పూజ , ఐశ్వర్య దీక్ష ,ఆరోగ్య దీక్షలు ఇవ్వడం జరిగింది. . తల్లితండ్రుల కు పిల్లల చేత పాదపూజ చేసే కార్యక్రమం జరిగింది. తల్లితండ్రుల ఆశీర్వాదం పిల్లలకు ఎంతో అవసరం. అలా ఆశీర్వాదం తీసుకుంటే ఎటువంటి అడ్డంకులు, సమస్యలు అయినా తొలగి పోయి అందరూ ఆనందమైన జీవితం గడుపుతారనితెలియజేశారు గురువులు.మరియు ధ్యానం వల్ల జ్ఞానం కలుగుతుంది. అందరిలో ఆధ్యాత్మికత పెరగాలని తద్వారా ఆనందకరమైన, ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందని, మరియు ధ్యానం వల్ల మానసిక శాంతి, ఆరోగ్యం చేకూరుతుందని గురువులు ఉపదేశించారు. అలా కావాలంటే ప్రతి ఒక్కరు ధ్యాన ప్రాధాన్యత తెలుసుకొని ధ్యాన, జ్ఞానమార్గాలలో నడవాలని తెలియజేశారు.