

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆసుపత్రి సూపర్డెంట్ శైలజ మాట్లాడుతూ జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ మోర్త వెంకటేష్, యోహానులు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమని, ఈ రక్తదాన శిబిరం వల్ల రక్తం అవసరమైన వారికి వెంటనే అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు.ఈ రక్తదాన శిబిరంలో వైద్యులు సౌమ్య, రమేష్, ల్యాబ్ టెక్నీషియన్లు త్రిమూర్తులు,మధు,రవి,సౌజన్య, శ్రీను,గణేశులు పాల్గొన్నారు.