విశ్వవిజేతగా టీమిండియా.. వికెట్లతో దాండియా ఆడిన కోహ్లీ, రోహిత్!

Mana News :- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీ, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు సంతోషంతో ఎగిరి గంతేసారు. బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేసిన రవీంద్ర జడేజా.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో కలిసి గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వికెట్లతో దాండియా ఆడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ హగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆటగాళ్లకు సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా… మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు.

Related Posts

ఎంతకు తెగించార్రా.. నమ్మితే ఇంత మోసం చేస్తారా!?

Mana News :- Virat Kohli VS Shreyas Iyer: ఆర్సీబీని దాని సొంతగడ్డపైనే ఓడించాక పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ కాస్త గట్టిగానే సంబరాలు చేసుకున్నాడు. మరి అది చూసిన విరాట్ కోహ్లీ ఊరుకుంటాడా? దానికి గట్టిగానే ప్రతీకారం తీర్చుకున్నాడు. ఏప్రిల్ 20న…

గుజరాత్ vs కోల్‌కతా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

Mana News :- పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (PBKS vs KKR) కేవలం 112 పరుగులను ఛేదించలేక బోల్తా పడి ఐపీఎల్ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ రోజు (ఏప్రిల్ 21)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

నేడు విద్యుత్తు అంతరాయం—ఇంజనీర్ కుళ్లాయప్ప.

జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

జలదంకి మండలం కమ్మవారిపాలెం లో గ్రామ కమిటీలు ఎన్నిక,,, ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!

టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

టిడిపి సీనియర్ నేత ముందలకు మోహన్ రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ..

ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

  • By APUROOP
  • April 27, 2025
  • 6 views
ముఫ్ఫై ఏళ్ల గడిచిన వారి స్నేహాం పదిలం…

భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

భారీ గాలులకు అనేక చోట్ల నెలకొరిగిన చెట్లు, కూలిన ఇంటి పై కప్పులు….

పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి

పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి