

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ప్రత్తిపాడు లో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో జాతీయ రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడులో రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు,ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.ఎస్ అప్పారావు,ప్రత్తిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మీకాంతం రోడ్డు భద్రత అవగాహన సదస్సును ఏర్పాటు చేసి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 2023 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం భారతదేశము నందు 1,73,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా,
4,63,000 మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడినట్లు తెలిపారు.అంతే కాకుండా దేశంలో ప్రతి గంటకు సుమారు 400 రోడ్డు ప్రమాద కేసులు నమోదు అవుతున్నట్లు నివేదికల ద్వారా వెల్లడించడం జరిగిందని, కావున ప్రజలందరూ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని,డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించరాదని,మైనర్లకు, చిన్న పిల్లలకు డ్రైవింగ్ ఇవ్వరాదని,పరిమిత వేగంతో వాహనాలు నడపవలెనని,అతి వేగం ప్రమాదకరమని,అదే విధంగా గ్రామాల నుండి హైవే రోడ్డుకు,హైవే రోడ్డు నుండి గ్రామాలకు వెళ్ళు జంక్షన్ల వద్ద రోడ్డుకి ఇరువైపులా గమనించి రోడ్ క్రాస్ చేయవలెనని,ప్రజలు రోడ్డు భద్రతా నియమాల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండి,రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా ప్రతీ ఒక్కరు పాటించాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, యలమాటి రవి కుమార్,సేఫ్టీ మేనేజర్స్ రాజా,అశోక్,ఆశిష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.